The biggest tech stories reported, analysed dissected by the best tech writers ,columnists & journalists in the country

phones

Image

firefox mozilla smart phone for 1500rs

రూ.1,500కే స్మార్ట్‌ ఫోన్‌

* త్వరలోనే తేనున్న మొజిల్లా
* స్పైస్‌, ఇంటెక్స్‌లతో జట్టు
న్యూఢిల్లీ: ఫైర్‌ఫాక్స్‌ వెబ్‌ బ్రౌజర్‌ రూపకర్త మొజిల్లా.. రూ.1500కే స్మార్ట్‌ ఫోన్‌ను అందించనుంది. మరికొన్ని నెలల్లోనే భారత విపణిలోకి వీటిని తేవాలని భావిస్తోంది. ఇందుకుగాను మొబైల్‌ తయారీ కంపెనీలైన ఇంటెక్స్‌, స్పైస్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ పరిణామం దేశీయ చౌక మొబైల్‌ ఫోన్ల విపణిలో సరికొత్త మార్పులకు నాంది కావొచ్చు. వర్థమాన దేశాలైన భారత్‌, చైనాయే లక్ష్యంగా గత ఫిబ్రవరిలో బార్సిలోనాలోని మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ స్మార్ట్‌ఫోను నమూనాను కంపెనీ ప్రదర్శించింది. ఫైర్‌ఫాక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్లు గూగుల్‌ ఆండ్రాయిడ్‌, మెక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఓఎస్‌ స్మార్ట్‌ఫోన్లకు పోటీనివ్వనున్నాయి.

Advertisements

Aside

“WORST PASSWORDS IN NET” అధమ పాస్‌వర్డ్‌లు!

Used by users

Worst passwords used in  the internet

అధమ పాస్‌వర్డ్‌లు!

నెట్టింట్లో బోల్డన్ని లాకర్లు! మెయిళ్లు కావచ్చు… క్లౌడ్‌స్టోరేజ్‌ అయ్యుండొచ్చు… సోషల్‌ నెట్‌వర్క్‌ వాడొచ్చు… ఏదైనాగానీ… క్లిష్టమైన పాస్‌వర్డ్‌ అనివార్యం! కానీ, మీకు తెలుసా?ఇంకా బలహీనమైన పాస్‌వర్డ్‌లు వాడుతున్నారు!
కిగానూ అధమమైన లాగిన్‌ తాళాలు ఇవేనట!

అనివార్యమై కొన్నిసార్లు వెబ్‌ సర్వీసుల్లో లాగిన్‌ అవుతుంటాం. సులువుగా గుర్తుండడానికి అప్పటికి ఏదొక పాస్‌వర్డ్‌ని పెట్టుకుంటాం. హాకర్లు ఇలాంటి వాటిని సులవుగా తెలుసుకుని వ్యక్తిగత వివరాల్ని దొంగిలిస్తారు. వాటినే బలహీనమైన పాస్‌వర్డ్‌లుగా గుర్తించొచ్చు. SplashDataఅనే సెక్యూరిటీ సంస్థ 2013లో వాడిన మొదటి 25 అధమ లాగిన్‌ తాళాల జాబితాని విడుదల చేసింది. వాటిల్లో మొదటి స్థానంలో 123456అనే పాస్‌వర్డ్‌ ఉంది. గత ఏడాది మొదటి వరుసలో నిలిచిన password ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో వరుసగా… 12345678, qwerty, abc123, 123456789, 111111, 1234567, iloveyou, adobe123, 123123, sunshine, 1234567890, letmein, photoshop, 1234, password1, princess, azerty, trustno1, 000000 పాస్‌వర్డ్‌లు ఉన్నాయి. మరి, వీటిల్లో మీరు పెట్టుకున్న పాస్‌వర్డ్‌ ఉందా? అయితే, వెంటనే మార్చేసుకోండి. లేకుంటే.. అంతే సంగతులు. హ్యాకర్ల చేతికి చిటికెలో చిక్కేస్తారు.


Image

Google Launches ‘Project Tango’ for Android 3D Mapping


Image

చౌకగా కావాలా?

అరచేయంత ట్యాబ్‌లు! కాస్త తక్కువ ధరకే!
మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి! ఆ ముచ్చట్లేంటో చూద్దాం!

ట్యాబ్లెట్‌… అరచేతిలో అద్భుతాలకు వేదికైంది. అత్యాధునిక ట్యాబ్‌ దగ్గర్నుంచి సాధారణ ట్యాబ్‌ వరకూ అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక స్థోమత మేరకు కాస్త తక్కువ ఉండి… తగిన బడ్జెట్‌లో ట్యాబ్‌ని కొనాలనే ఆలోచనతో ఉన్నారా? ఈమెయిల్స్‌.. నెట్‌ బ్రౌజింగ్‌… బోర్‌ అనిపిస్తే వీడియోగేమ్స్‌ ఆడుకునేందుకు అనువైన ట్యాబ్లెట్ల జాబితా ఏంటో కాస్త వివరంగా చూద్దాం!

ఎనిమిది అంగుళాల తాకే తెరతో గేమ్స్‌, బ్రౌజింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ చేయాలంటే కార్బన్‌ కంపెనీ తయారు చేసిన Smart Tab 8 Velox ట్యాబ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. రిజల్యూషన్‌ 1024X768 పిక్సల్స్‌. బరువు 330 గ్రాములు. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌తో పని చేస్తుంది. ఇంటర్నల్‌ మెమొరీ 1.51 జీబీ. కావాలంటే 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. వెనక భాగంలో 3 మెగాపిక్సల్‌ కెమేరాని ఏర్పాటు చేశారు. ముందు వీడియో ఛాటింగ్‌కి వీజీఏ కెమేరా ఉంది. హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4,500 mAh. ధర రూ.6,899. ఇతర వివరాలకు  http://goo.gl /DVa76* లావా కంపెనీ అందిస్తున్న E-Tab Xtron మరోటి. తెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1024X600 పిక్సల్స్‌. ధర సుమారు రూ.6,500. ఇతర వివరాలకు  http://goo.gl /s5DiW

please share if u like it….