The biggest tech stories reported, analysed dissected by the best tech writers ,columnists & journalists in the country

Archive for July, 2014

Image

జీమెయిల్‌ నుంచే ఎస్‌ఎంఎస్‌లు

జీమెయిల్‌ నుంచే ఎస్‌ఎంఎస్‌లు
*జీమెయిల్‌లో ఛాటింగ్‌ తెలిసిందే…
*మరి, ఛాట్‌ చేయాలనుకునే వ్యక్తి ఆన్‌లైన్‌లో లేకపోతే?
*వెంటనే మొబైల్‌కి మెసేజ్‌లు చేయవచ్చు…
*’జీమెయిల్‌ ఎసెమ్మెస్‌’తో ఇది సాధ్యమే!
అదెలాగో చూద్దామా?
*మీకు తెలుసా?
ఎసెమ్మెస్‌ సర్వీసుని వాడుకోవాలంటే జీమెయిల్‌ ఎకౌంట్‌ ఉండాల్సిందే. ఒకవేళ లేకుంటే ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. అప్పుడు  www.google.com/mobile /sms/mail/ లింక్‌లోకి వెళ్లండి. లింక్‌లోని హోం పేజీలో కనిపించే Sign in and Try Gmail SMS పై క్లిక్‌ చేసి సర్వీసులోకి లాగిన్‌ అవ్వాలి. ఇప్పుడు జీమెయిల్‌ ఎకౌంట్‌లోని సెట్టింగ్స్‌ గుర్తుపై క్లిక్‌ చేసి Settings->Labsలోకి వెళ్లాలి. అక్కడి జాబితాలో కనిపించే SMS (text Messaging) in chat ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసి Save changes పైన క్లిక్‌ చేయాలి. తిరిగి జీమెయిల్‌ హోం పేజీలోకి వచ్చి మొబైల్‌ నెంబర్లను సేవ్‌ చేసుకోవాలి.
‘ఇన్విటేషన్‌’ మాదిరిగానే!
జీమెయిల్‌ ఛాటింగ్‌కి ఆహ్వానాన్ని పంపిన మాదిరిగానే ఛాట్‌లో కనిపించే సెర్చ్‌బాక్స్‌లో మొబైల్‌ నెంబర్‌ని టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. మెచ్చిన మెనూ ద్వారా మొబైల్‌ నెంబర్‌ని ఏదైనా పేరుతో సేవ్‌ చేయాలి. దీంతో ఎంటర్‌ చేసిన మొబైల్‌ నెంబరు, పేరుతో ఛాటింగ్‌ బాక్స్‌ కుడివైపు ఓపెన్‌ అవుతుంది. ఇక జీమెయిల్‌ ఛాటింగ్‌ మాదిరిగానే మెసేజ్‌లు పంపొచ్చు. మెయిల్‌ ఐడీ వివరాలతో సెలెక్ట్‌ చేసుకున్న మొబైల్‌ నెంబర్‌కి మెసేజ్‌ చేరిపోతుంది. వాడుతున్న బేసిక్‌ మొబైల్‌ నుంచి కూడా మొబైల్‌ యూజర్లు రిప్త్లె టైప్‌ చేసి పంపొచ్చు. జీమెయిల్‌ ఛాట్‌ ఛాట్‌బాక్స్‌లో రిప్త్లె చేరిపోతుంది. అందుకు మొబైల్‌ వినియోగదారుడికి అయ్యే ఖర్చు సాధారణ ఎస్‌ఎంఎస్‌ ఖరీదే. అంటే మరో మొబైల్‌కి మేసేజ్‌ చేస్తే ఎంత ఖర్చవుతుందో అంతే అన్నమాట. ఇక మొబైల్‌ నెంబర్‌తో ఎంటర్‌ చేసిన కాంటాక్ట్‌లు అన్నీ మొబైల్‌ గుర్తుతో ‘ఛాట్‌ లిస్ట్‌’లో కనిపిస్తాయి. ఎవరికైతే మెసేజ్‌ పంపాలనుకుంటున్నారో ఆ పేరుపై క్లిక్‌ చేస్తే మెసేజ్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. ఈ జీమెయిల్‌ ఎస్‌ఎంఎస్‌ సర్వీసుతో ప్రపంచంలో ఏ దేశంలోని నెంబర్‌కి అయినా ఉచితంగా మెసేజ్‌లు పంపొచ్చు. ఆయా మొబైళ్లకు పంపిన మెసేజ్‌లను ఛాటింగ్‌ హిస్టరీలో పొందొచ్చు.

Advertisements